English | Telugu
డైరక్షన్ చేస్తున్న దిశా పటాని... బోణీ అదుర్స్!
Updated : Aug 15, 2023
దిశా పటాని గురించి బాలీవుడ్‌లో మామూలుగా మాట్లాడుకోవడం లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ప్రతి క్షణాన్ని తన మనసుకు నచ్చినట్టు మలుచుకుంటున్నారు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు దిశా పటాని.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో దిశా పటాని ఓ నాయిక. ఈ సినిమా తర్వాత ఆమె కంగువలోనూ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సౌత్‌లో రెండు ప్రాజెక్టులతో ఫిదా చేయడానికి రెడీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ నార్త్ ఆడియన్స్‌కి మరో సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
క్యూ కరో ఫికర్ అనే వీడియో సాంగ్‌తో డైరక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు దిశా పటాని. ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూసి వావ్ అంటూ మెచ్చుకునే ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో సోషల్ మీడియా చూస్తే జస్ట్ అలా అర్థమైపోతుంది. ఆమె డ్యాన్సులకు కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. మలాంగ్, స్లో మోషన్, డు యువ్ లవ్ మీలో ఆమె డ్యాన్సులు చూసి ఫిదా కాని వారే లేరు.
ఆగస్టు 14న ఆమె తన ఇన్‌స్టా పోస్టుతో డైరక్షన్ గురించి అనౌన్స్ చేశారు. నటిగా, బెస్ట్ డ్యాన్సర్‌గా నన్ను చాలా ఆదరించారు. ఇప్పుడు నాలో ఉన్న మరొక ప్రతిభను పరిచయం చేస్తున్నాను అంటూ తాను డైరక్ట్ చేసే విషయాన్ని గురించి ప్రస్తావించారు. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. వాటిని కంట్రోల్ చేయలేం అని అన్నారు దిశా పటాని.
ఆగస్టు 16 నుంచి ఆమె డైరక్ట్ చేసిన వీడియో సాంగ్ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని చెబుతూ బటర్‌ఫ్లై ఎమోజీలను, స్పార్క్లింగ్ ఎమోజీలను, హార్ట్ ఎమోజీలను కూడా షేర్ చేశారు దిశా పటాని.