Read more!

English | Telugu

దీపికా పదుకునే లవర్ ఎంగేజ్ మెంట్ 

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మీ అందరికి గుర్తుండే ఉంటాడు. వ్యాపార సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. విజయ్ మాల్యా కొడుకు పేరు సిద్దార్ధ. అతను ఒకప్పుడు ప్రముఖ నటి దీపికా పదుకునే కి లవర్ అనే అన్నారు.ఇప్పుడు సిద్దార్ధ కి సంబంధించిన తాజా మాటర్ ఒకటి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

 సిద్దార్ధ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు. తాజాగా తన ఎంగేజ్ మెంట్ జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన హాలోవిన్  పార్టీ లో నటుడు,మోడల్ అయిన సిద్దార్ధ తన ప్రియురాలు జాస్మిన్ చేతికి రింగ్  తొడిగాడు. సిద్దార్ధ రెండు మోకాళ్లమీద కింద కూర్చొని మరి తన ప్రేమని యాక్సెప్ట్ చెయ్యి జాస్మిన్ అని అభ్యర్దించి జాస్మిన్ పర్మిషన్ తో నిశ్చితార్ధం చేసుకున్నాడు.అతి కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు. 

సిద్దార్ధ మాల్యా,  దీపికా పదుకుణెలు ఒకప్పుడు ప్రేమించుకున్నారు.ఇద్దరు ఐపియల్ మ్యాచ్ లు ప్రారంభం అయిన తొలినాళ్లలో  కలిసి మ్యాచ్ లకి వెళ్లే వాళ్ళు .ఆ రోజుల్లో  సిద్దార్ధ మాల్యా  బెంగుళూరు జట్టుకి ఓనర్ గా ఉండేవాడు. ఆ మ్యాచ్ లు జరిగే సందర్భంలో దీపికా పదుకునే బహిరంగంగానే సిద్దార్ధ కి ముద్దు పెట్టి అతన్ని తన లవర్ అని అందరికి చెప్పకనే చెప్పింది. మరి ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని  కొంత కాలానికి ఇద్దరు విడిపోయారు. సినిమా ల్లో బిజీ గా ఉంటూనే దీపికా పదుకునే రణబీర్ సింగ్ ని పెళ్లిచేసుకుంది.సిద్దార్ధ జాస్మిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు.