Read more!

English | Telugu

తాగుబోతుతో సల్మాన్ ఖాన్...బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు కమెడియన్!

ఇటీవలి కాలంలో ఆ ఇండస్ట్రీ , ఈ ఇండస్ట్రీ అని ఏమీ లేదు. ఎవరు ఏ ఇండస్ట్రీలోనైనా స్వేచ్ఛగా నటించేస్తున్నారు. ఓటిటి ప్లాట్ఫార్మ్ వచ్చాక జనాలు అన్ని భాషల చిత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వేరే భాష నటులు మన భాషలో విలన్స్ గా, పవర్ ఫుల్ సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. మన వాళ్ళు కూడా అలాగే వేరే భాషల్లో నటిస్తున్నారు. 

ఒక రేంజ్ యాక్టర్స్ ఇతర భాషల్లోకి వెళ్లడం చూస్తూనే ఉన్నాం కానీ ఒక కమెడియన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. అతనే తాగుబోతు రమేష్. ఇక ఈ టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో తాగుబోతు క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను మెప్పించి.. చివరికి క్యారెక్టర్స్ లోని "తాగుబోతు"నే ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అయితే.. ఇప్పటివరకూ తెలుగు సినిమాలలోనే అలరించిన రమేష్.. త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా  హిందీ సినిమాలో కూడా కామెడీ పండించనున్నట్లు సమాచారం. ఐతే రమేష్ కొంతకాలం నుంచి తెలుగు సినిమాల్లో నటించడంలేదు. బుల్లితెర మీద ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు  ఏకంగా బాలీవుడ్ లో.. అదీ సల్మాన్ ఖాన్ మూవీలో అవకాశం అందుకున్నాడని తెలిసేసరికి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

సల్మాన్ తో కలిసి ఫోటో దిగి దాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ గుడ్ న్యూస్ కి విద్యు రామన్ "వావ్ వావ్ సూపర్బ్" అని రిప్లై ఇచ్చింది. నెటిజన్స్ కూడా తాగుబోతు రమేష్ కి విషెస్ చెప్తున్నారు. ఇక హిందీ మూవీ లో తాగుబోతు రమేష్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడనేది వేచి చూడాలి.