English | Telugu

స్వలింగ వివాహాలపై సుప్రీమ్‌ కోర్టు తీర్పు... బాలీవుడ్ హీరోయిన్స్ అసంతృప్తి!

2003లో ‘జానాషీన్‌’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సెలీనా జైట్లీ 2020 వరకు ఓ ఇరవై సినిమాల్లో నటించింది. 2004లో మంచు విష్ణు హీరోగా వి.సముద్ర దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా అది. గత మూడు సంవత్సరాలుగా ఏ సినిమా చెయ్యని సెలీనా కొత్త వివాదాలకు తెరతీసింది. ఇటీవల స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిరచింది సెలీనా జైట్లీ. కోర్టు తీర్పు పట్ల తన నిరసనను వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్లమెంటుకే వదిలేసింది కోర్టు.

దీనిపై సెలీనా జైట్లీ స్పందిస్తూ ‘‘సుప్రీమ్‌ కోర్టు తీర్పు నాకు నిరాశను కలిగించింది. ఎల్‌ జీబీటీ కమ్యూనిటీ అసహజమైన హక్కులను కోరడం లేదని తెలుసుకోవాలి. 20 ఏళ్ళ నుంచి ఈ సంస్థ కార్యకర్తగా ఉన్నాను. వివాహం చేసుకొని కుటుంబాన్ని ఏర్పరుచుకోవడం అనేది ప్రాథమిక హక్కు. దీనిపై పార్లమెంట్‌ అయినా కల్పించుకొని ప్రత్యేక వివాహ చట్టం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

విరుద్ధమైన జంటల ప్రయోజనాలు, హక్కులను పరిశీలించేందుకు సుప్రీమ్‌ కోర్టు కట్టుబడి ఉందంటూ ఒక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడాన్ని శుభసూచకమని సెలీనా పేర్కొంది. ‘బదానీ’ చిత్రంలో ఒక లెస్బియన్‌ పాత్ర పోషించిన భూమి పెడ్నేకర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.