English | Telugu

ఆ డ్రీమ్‌ గర్ల్‌.. సీరియల్‌ కిల్లర్‌ అంటే నమ్మగలమా?

దాదాపు రెండు దశాబ్దాలు తన నటనతో, డాన్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న కుర్రకారును ఉర్రూతలూగించి వారి ఆరాధ్య దేవతగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌. తనను స్టార్‌ని చేసిన నటనను వదిలిపెట్టకుండా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్న మాధురి ఇప్పుడు ఓ కొత్త అవతారం ఎత్తబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న ‘మిస్టర్‌ దేశ్‌పాండే’ అనే వెబ్‌ సిరీస్‌లో సీరియల్‌ కిల్లర్‌గా నటించబోతోంది. దీనికి నగేశ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పుడు తమ కలల రాణిగా అందరూ భావించిన మాధురీని ఇప్పుడు సీరియల్‌ కిల్లర్‌గా చూడగలమా అంటూ నెటిజన్లు ఈ ప్రాజెక్ట్‌ గురించి రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. మరోపక్క ఈ కొత్త క్యారెక్టర్‌లో మాధురీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తిని కూడా కొందరు వ్యక్తపరిచారు. 

సీరియల్‌ కిల్లర్స్‌ ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. విదేశాల్లో ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్స్‌కి మంచి క్రేజ్‌ ఉంది. ఫ్రెంచ్‌లో రూపొందిన ఓ వెబ్‌సిరీస్‌కి రీమేక్‌గా ‘మిస్టర్‌ దేశ్‌పాండే’ను చేయబోతున్నారు. ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ని పట్టుకునేందుకు మరో సీరియల్‌ కిల్లర్‌ను రంగంలోకి దించుతారు. ఈ క్రమంలో సాగే కథలో ఎన్నో థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ వెబ్‌ సిరీస్‌ను రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. దీనిలో నటించే మిగతా నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల ఎంపిక జరగాల్సి ఉంది.