English | Telugu
'బవాల్' టీజర్ రిలీజ్... జాన్వీ పెర్ఫార్మెన్స్ అదుర్స్!
Updated : Jul 6, 2023
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'బవాల్' సినిమా టీజర్ విడుదలైంది. ఎమోషనల్ లవ్ స్టోరీకి సంబంధించిన టీజర్ అది. ఈ నెల 21న ఓటీటీలో విడుదల కానుంది బవాల్. వరుణ్‌ధావన్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న తొలి సినిమా బవాల్. నితీష్ తివారి దర్శకత్వం వహించారు.
2023లో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో బవాల్ ఒకటనే పేరు వచ్చేసింది. ఎమోషనల్‌గా సాగే లవ్ స్టోరీ అని ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఒకరితో ఒకరు ప్రేమలో పడి, సరదాగా ఉన్నంత కాలం హాయిగా గడిపేస్తుంది ఓ జంట. కానీ, రిలేషన్ షిప్‌లో గుడ్ బై చెప్పుకున్నాక అసలు సమస్యలు మొదలవుతాయి. ప్రేమ ఊరికే రాదు. కొంచెం బవాల్‌కి రెడీగా ఉండండి అంటూ వరుణ్ టీజర్‌ని షేర్ చేస్తూ కామెంట్ పోస్ట్ చేశారు. ఇందులో వరుణ్ అజయ్ కేరక్టర్‌లోనూ, నిష కేరక్టర్‌లో జాన్వీ కనిపిస్తారు.
టీజర్ చూశాక మాటలు రావడం లేదని రాశారు ఓ నెటిజన్. ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాల్సింది. ఎందుకు ఓటీటీకి వెళ్తున్నారు. అది రాంగ్ ఛాయిస్ అని అన్నారు మరో నెటిజన్.
మూడు ఇండియన్ లొకేషన్లలోనూ, ఐదు యూరోపియన్ కంట్రీస్‌లోనూ ఈ సినిమాను తెరకెక్కించారు. అద్భుతమైన కథ, డ్రమాటిక్ విజువల్స్, వరుణ్, జాన్వీ మధ్య అమేజింగ్ కెమిస్ట్రీ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్నాయి.
వరుణ్ ఈ సినిమా తర్వాత సిటీడెల్ ప్రమోషన్లతో బిజీ అయిపోతారు. అటు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌కి హాజరవుతారు.