English | Telugu
ఫర్హాన్ అక్తర్‌కి నో చెప్పిన అనుష్క శర్మ
Updated : Jul 10, 2023
అనుష్క శర్మ తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ సంచలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అనుష్క శర్మ. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఓ క్యారెక్టర్ కు నో చెప్పారు. జీ లే జారా సినిమాలో ప్రియాంక చోప్రా నటించాల్సింది. అయితే ఆమె హాలీవుడ్ ప్రాజెక్టుల కారణంగా డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరకపోవడంతో, చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేయాల్సిన పాత్రను అనుష్క శర్మకు ఆఫర్ చేశారు ఫర్హాన్. అయితే అనుష్క శర్మ ఇప్పుడు ఈ సినిమా చేయలేనని చెప్పినట్టు సమాచారం. తమని తాము ఆవిష్కరించుకోవడానికి గాను జర్నీ మొదలుపెట్టిన ముగ్గురు అమ్మాయిల జీవితం లో జరిగిన విషయాలు, అనుభవాలు... వీటన్నిటిని పోగేసి కథగా రాసుకున్నారు ఫర్హాన్.
ఇందులో మెయిన్ గా ప్రియాంక చోప్రా, అలియాభట్, కత్రినా కైఫ్ నటిస్తారని అనౌన్స్ చేశారు. అయితే ప్రాజెక్టుని అనౌన్స్ చేసి రెండేళ్లు దాటింది. ఇప్పటిదాకా సెట్స్ మీదకు వెళ్లలేదు. దాంతో తన ఫ్యూచర్ కమిట్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని తాను ఈ సినిమా చేయలేనని ప్రియాంక చోప్రా ఇన్‌ఫార్మ్ చేశారు. ఆమె అడుగుజాడల్లోనే కత్రినా కైఫ్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే కత్రినా కైఫ్ వెళ్ళట్లేదని, ఆమె ఈ ప్రాజెక్టులో ఉన్నారని, మళ్లీ నార్త్ మీడియా వార్తలు ప్రచురించింది. దీంతో ఇప్పుడు ప్రియాంక చోప్రా రోల్ కి మాత్రమే నటీమణుల్ని అన్వేషిస్తున్నట్టు తేటతెల్లమైంది. ప్రియాంక పాత్ర కోసం అనుష్క శర్మను అనుకున్నారు. అయితే కథ విన్న అనుష్క శర్మ ఎగ్జిట్ అయిన మాట మాత్రం వాస్తవమేనట.
కానీ తన కాల్ షీట్ లకి, ఈ సినిమా డిమాండ్ చేసే కాల్ షీట్లకి బ్యాలెన్స్ కుదరకపోవడంతో ఆమె కాల్ షీట్లు అలాట్ చేయలేనని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఇంకొక నటి ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యేవరకు ఫర్హాన్ జీ లే జారాను హోల్డ్ లో పెట్టారని నార్త్ మీడియా ఇన్ఫో. ఫర్హాన్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ హీరోగా త్వరలోనే డాన్ 3 మొదలుకానుంది. జులై 6న ఈ సినిమాను అనౌన్స్ చేస్తారనుకున్నారు. కానీ ప్రభాస్ సలార్ టీజర్ తో క్లాష్ కావడం ఇష్టం లేక అనౌన్స్మెంట్ ని పోస్ట్ పోన్ చేశారు.