English | Telugu
అట్లీ సిగ్నేచర్ స్టైల్లో జవాన్
Updated : Jul 10, 2023
షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా జవాన్. జవాన్ ప్రివ్యూ ఇవాళ విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు అట్లీ గత చిత్రాల స్టైల్ జవాన్ లో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ సినిమాల్లో ఎప్పుడూ గ్రాండ్ సెట్స్, క్యారెక్టర్ లో భిన్న కోణాలు, అసలు ఎవరి ఊహకి అందని హీరోయిజం ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ జవాన్‌లోనూ ఉన్నాయి. జవాన్ చూసిన వాళ్ళందరూ అట్లీ సినిమాల్లోని ఈ లక్షణాలన్నీ ఇందులోనూ కనిపిస్తున్నాయని అంటున్నారు. నార్త్లో తరికెక్కించినప్పటికీ తన ఒరిజినల్ స్టైల్ ని అట్లీ మిస్ చేయలేదని ప్రశంసిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించిన సినిమా జవాన్.
ఇందులో దీపిక పదుకొనే కూడా నటిస్తున్నారు. ఎప్పటినుంచో ఆమె నటిస్తున్నట్టు వార్తలున్నాయి. ఇవాళ విడుదలైన ప్రివ్యూలో దీపిక పదుకొనే యాక్షన్ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దళపతి విజయ్ కూడా ఇందులో కనిపిస్తున్నారని అంటున్నారు. ఫాన్స్ ప్రివ్యూలో కొన్ని లింక్స్ ని, షార్ట్స్ ని కట్ చేసి విజయ్ ఆకారంగా పోలుస్తున్నారు. అయితే విజయ్ ఎంట్రీ గురించి యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. జవాన్ టీం చెప్పిన ప్రతి డైలాగు, ప్రతిఫ్రేము మెప్పిస్తున్నాయి. హీరోయిన్ల క్యారెక్టర్ లను అట్లీ పోట్రే చేసిన విధానం మాస్టర్ పీస్ గా ఉందని అంటున్నారు అభిమానులు. ఒక ఫ్యాన్ బాయ్ నచ్చిన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో జవాన్ మచ్చుతునకని చెబుతున్నారు. విజయ్ ని మెర్సల్, తేరి, బిగిల్ సినిమాల్లో ఎంత మాస్‌గా చూపించారో, జవాన్‌లో షారుఖ్‌ని అలాగే చూపించారని అంటున్నారు. చివరి ఫ్రేమ్లో షారుఖ్ గుండుతో కనిపించిన విధానం మెస్మరైజింగ్ గా, సర్ప్రైజ్ ఎలిమెంట్ గా కుదిరింది. షారుఖ్, నయనతార నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. అట్లీకి నార్త్ లో దర్శకుడిగా ఇదే తొలి సినిమా. నయనతార కూడా ఈ చిత్రంతోనే నార్త్ లో అడుగు పెడుతున్నారు.