Read more!

English | Telugu

త‌ల్లులు అలా చేయ‌డం కామ‌న్ అంటున్న ఆలియా

ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ప‌ద‌కొండేళ్ల‌వుతోంది ఆలియా. మొద‌టి సంవ‌త్స‌రం కొత్త‌గా భావించినా, ఆ త‌ర్వాత ఈ ద‌శాబ్ద‌కాలంలో ఆమె అనుకున్న పాత్ర‌ల‌న్నీ చేసేశారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌ని వివాహం చేసుకుని ర‌హాకి జ‌న్మ‌నిచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ లీడ‌ర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఆలియా మాట్లాడారు. పెళ్లయ్యాక‌, పాప పుట్టాక తాను ప‌నిచేయ‌డం గురించి ఈ భామ అంద‌రితోనూ పంచుకున్నారు.

ఆలియా మాట్లాడుతూ ``ఇంట్లో ఉన్న‌ప్పుడు ర‌హాని నేను చూసుకుంటాను. నేను బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు నా పాప‌ను చూసుకోవ‌డానికి మావాళ్లున్నారు. నేను, ర‌ణ్‌బీర్ మా షెడ్యూళ్ల‌ను దానికి త‌గ్గ‌ట్టు ప్లాన్ చేసుకుంటాం. నేనే కాదు, త‌ర‌త‌రాలుగా మ‌న‌వాళ్లంద‌రూ అలాగే ప్లాన్ చేసుకునేవారు. మా నాన్న‌మ్మ‌కి ముగ్గురు పిల్ల‌లు. ఆమె పిల్ల‌లు పుట్టాక కూడా ప‌నిచేస్తూనే ఉన్నారు. ప‌నిచేయ‌డం అనేది మ‌న సంస్కృతిలో భాగం. మ‌నం ఎవ్వ‌రం ఊరికే కూర్చోని ఉండ‌లేం. ఏదో ఒక ప‌నిచేస్తూనే ఉంటాం. ఇంట్లో ప‌ని చేస్తున్న వారిని, ప‌నిచేస్తున్న‌వారిగా భావించ‌క‌పోవ‌డం విడ్డూరం. ఇంట్లోనే చాలా ప‌ని ఉంటుందనే విష‌యాన్ని అంద‌రూ గ్ర‌హించాలి`` అని అన్నారు.

అన్నీ విష‌యాల్లోనూ ఇంత ప‌ర్ఫెక్ట్‌గా ఎలా ఉండ‌గ‌లుగుతున్నారు అని అడిగితే, దానికి న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారు ఆలియా. ``మ‌న‌లో ఎవ‌రూ కంప్లీట్ ప‌ర్ఫెక్ట్ గా ఉండ‌రు. కాక‌పోతే, ఉన్నంత‌లో, తెలిసినంత‌లో బాగా చేసుకుంటూ పోతాం. మ‌న‌కు తెలిసిన‌ట్టు మ‌నం చేస్తాం. అలా కాదు, ఇలా అని ఇంకాస్త తెలిసిన‌వారు చెబుతారు. అంతేగానీ, అన్నిట్లోనూ మ‌నం టాప్ అని అనుకోకూడ‌దు. కొన్నిసార్లు నేను మా అమ్మాయిని ఇంట్లో వ‌దిలిపెట్టి వెళ్తుంటాను. ఆ క్ష‌ణం నాకు త‌న‌ని వ‌ద‌లాల‌ని అనిపించ‌దు. కానీ త‌ప్పదు. కాక‌పోతే, నేను అక్క‌డ ఉన్నా, లేకున్నా త‌ను హ్యాపీగా ఉందా, లేదా అనే విష‌యాన్ని ప‌ట్టించుకుంటాను. ఆ విష‌యంలో ఎప్పుడూ రాజీ ప‌డ‌ను`` అని అన్నారు ఆలియా.