Read more!

English | Telugu

అలియాభట్ చెప్పిన నిజంతో బయటపడ్డ రణబీర్ అసలు రూపం

బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రణబీర్ కపూర్  అలియాభట్ లు కూడా ఒకరు. సినిమా రంగంలో హీరో,హీరోయిన్ లుగా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే ఇద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత వీరికి రహ అనే అందమైన పాప కూడా పుట్టింది. తాజాగా అలియాభట్ ఒక షో లో పాల్గొంది. ఆ షో లో రణబీర్ కపూర్ గురించి  అలియా చెప్పిన కొన్ని నిజాలు బాలీవుడ్ లో మంటలు పుట్టిస్తున్నాయి.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనాటాండన్ తో కలిసి అలియా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో పాల్గొంది. ఆ కార్యక్రమంలో కొన్ని రోజుల నుంచి రణబీర్ కపూర్ మీద వినిపిస్తున్నపుకార్ల గురించి మాట్లాడింది. రణబీర్ కపూర్ మంచి వాడు కాదని, అలియాని వేధిస్తున్నాడని రణబీర్ తో పడలేక అలియా తన కూతురు తో కలిసి వేరే ప్లాట్ లో ఉంటుందని కొన్ని రోజుల్లో ఇద్దరు విడాకులు కూడా తీసుకోబోతున్నారని ఇలా రకరకాలుగా రణబీర్ మీద వస్తున్న పుకార్లుకి అలియా తెరదించింది. రణబీర్ చాలా మంచి వాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు పాప అంటే ఆయనకి ప్రాణం అని చెప్పింది.

 

అసలు రణబీర్ నన్ను వేదిస్తున్నాడనే ఒక అబద్దపు వార్తని ఎలా పుట్టిస్తారో కూడా తెలియడం లేదు. గతంలో ఏదో ఒక షో లో రణబీర్ కి నేను లిప్ స్టిక్ వేసుకోవడం  నచ్చదని  చెప్పాను. నేను చెప్పిన ఆ మాటని  వేరే గా అర్ధం చేసుకొని   రణబీర్ మీద అలాంటి వార్తలన్నీ పుట్టించారు.  ఈ ఇంటర్నెట్ కాలంలో చేతిలో మొబైల్ ఉన్న ప్రతివాడు జర్నలిస్ట్  సెలెబ్రిటీలపై ఏదో ఒక రూమర్ సృష్టిస్తూనే ఉన్నాడు.ఒక సారి నేను తెల్లగా సన్నగా అవడానికి సర్జరీ చేయించుకున్నాను అనే రూమర్ ని కూడా సృష్టించారు. నా గురించి ఎన్ని రూమర్స్ వచ్చిన నేనేం బాధపడను. రణబీర్ గురించి తప్పుగా వచ్చిన వార్తల పైనే చాలా బాధపడ్డాను అని అలియా చెప్పింది. సో రణబీర్ అలియాల మధ్య  గొడవలు ఉన్నాయన్నది అబద్దం.