Read more!

English | Telugu

సంప్రదాయ దుస్తుల్లో గంగా హారతికి హాజరైన సన్నీ లియోన్‌!

ప్రపంచవ్యాప్తంగా సన్నిలియోన్‌ గురించి తెలీని వారుండరు. పోర్న్‌ స్టార్‌గా అందరికీ సుపరిచితమే. తన కెరీర్‌ను పోర్న్‌స్టార్‌గానే స్టార్ట్‌ చేసి ఆ తర్వాత అలాంటి కంటెంట్‌కి స్వస్తి చెప్పి నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకోవాలని డిసైడ్‌ అయ్యింది. అందులో భాగంగానే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో పలు విజయాలు సాధించింది. భారత సంతతికి చెందిన సన్నీకి ఇండియాలో అభిమానులు ఎక్కువే. అందుకే ఆమె చేసిన వీడియోలకు, సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ కొన్ని స్పెషల్‌ క్యారెక్టర్స్‌ చేసి తెలుగువారిని సైతం మెప్పించింది. 

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇటీవల వారణాసి వెళ్ళి గంగాహారతిలో పాల్గొంది సన్నీ. సంప్రదాయ దుస్తుల్లో, మెడలో దండ ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె పూజ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెతోపాటు నటుడు అభిషేక్‌ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి చేసిన ‘థర్డ్‌ పార్టీ’ మ్యూజిక్‌ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ పాటను అభిషేక్‌ సింగ్‌ రాసి, స్వయంగా పాడారు. అంతే కాదు, ఈ పాటను కంపోజ్‌ చేసింది కూడా అతనే కావడం విశేషం.