English | Telugu
ఆలియా గురించి ఆరా తీస్తున్న ఫిమేల్ గ్యాంగ్
Updated : Jul 11, 2023
ఆలియా భట్ మీద ఇప్పుడు యూత్ దృష్టి చాలానే ఉంది. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చారు ఆలియా. ఓవైపు కూతురు రహా ఆలనాపాలనా చూసుకుంటూనే షూటింగ్లో పాల్గొన్నారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ అంత ఫిట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆలియా గురించి ఆరా తీస్తున్నారు జనాలు. ఆలియా హీరోయిన్ గా రన్వీర్ సింగ్ హీరోగా తుమ్ క్యా మిలే అనే పాట విడుదలైంది. ఈ రొమాంటిక్ నెంబర్ రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలోనిది. ఈ సాంగ్ విడుదలైన తొలి రోజు నుంచే ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఆలియా రన్వీర్ మధ్య మరింత రొమాంటిక్‌గా తెరకెక్కించారు. కరణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ పాటలో నటించడం గురించి ఆలియా మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ ``రహ డెలివరీ తర్వాత వెంటనే బ్యాక్ టు ఫిట్నెస్ అని అనిపించింది. అందుకే వెంటనే నేను ఫిట్నెస్ కి ఎక్కువ టైమ్ కేటాయించాను. నాకు రహపుట్టిన తర్వాత నాలుగు వారాల్లోనే ఈ పాట షూటింగ్ మొదలుపెడదామన్నారు.
అయితే ఆరు వారాల తర్వాత నేను షూటింగ్ కి వస్తా అని ముందే చెప్పాను. దానికి తగ్గట్టే నేను ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకున్నాను. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా వ్యాయామాలు చేశాను. మేము అనుకున్న లక్ష్యం పెద్దది. అందుకే నిదానంగా దాన్ని సాధించడం వైపు అడుగులు వేశాను. అప్పుడు చేసిన వ్యాయామాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా డిసిప్లైన్, వర్క్ అవుట్ రొటీన్ తో పాటు వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్ ని ప్లాన్ చేసుకున్నాను. అందుకే ఎక్కడ పోస్ట్ ప్రెగ్నెన్సీ లేజీనెస్, ఓవర్ వెయిట్ నాలో కనిపించలేదు`` అని అన్నారు. రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించారు. హిందీ, బెంగాలీ సినిమాల నుంచి కీలక నటీనటులు ఈ సినిమాలో ఎక్కువమంది కనిపిస్తారు. ప్రీతం సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి స్పందన వస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా గురించి ప్రచారం చేస్తుంది ధర్మ ప్రొడక్షన్స్. వయాకామ్ 18 స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించింది ధర్మా ప్రొడక్షన్స్. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఏడో సినిమా ఇది. ఈ నెల 28న థియేటర్లో రిలీజ్ కానుంది రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహాని.