English | Telugu
అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి బాజాలు.. ఐరాకి పెళ్లి!
Updated : Oct 11, 2023
ఆమిర్ గారాలపట్టి ఐరాఖాన్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతోంది. ఆమిర్‌ఖాన్ త్వరలోనే కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి రెడీ అవుతున్నారు. నుపుర్ షికర్‌తో తన కుమార్తె పెళ్లి జరగబోతోందంటూ ఆమీర్‌ఖాన్ అనౌన్స్ చేశారు. ఆమిర్‌ఖాన్ తనయ ఐరాఖాన్ గత కొన్నేళ్లుగా నుపుర్ షికర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఐరాఖాన్, నుపుర్ షికర్ నిశ్చితార్థవేడుక ఘనంగా జరిగింది. ఆమిర్, ఇమ్రాన్ ఖాన్, కిరణ్ రావు, ఫాతిమా సనా షేక్, మన్సూర్ ఖాన్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ నిశ్చితార్థంలో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ ఏడాది చివరన పెళ్లి ఉంటుందంటూ గత కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. అయితే 2024లో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్టు ప్రకటించారు ఆమిర్‌ఖాన్. ఆ రోజు ఎమోషనల్‌గా తనకు చాలా పెద్ద రోజని అన్నారు.
ఆమిర్ మాట్లాడుతూ ``ఐరాఖాన్‌కీ, నుపుర్ షికర్‌రి వచ్చే ఏడాది జనవరి 3న పెళ్లి చేయాలని నిర్ణయించాం. నుపుర్ ఇప్పటికే నాకు కొడుకులా మారిపోయాడు. పోపెయే ది సైలర్ మేన్ అని ఇప్పటికే మేం ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఐరా సెలక్షన్ చాలా బావుంది. తను ట్రైనర్. చాలా మంచి వాడు. ఐరా తన డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నుపుర్ తనకి మెంటల్‌గా, ఎమోషనల్‌గా చాలా సపోర్ట్ చేశాడు. వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఆనందంగా ఉంటే చూడాలనిపిస్తోంది. నుపుర్ తల్లి ప్రీమ్‌కి మా ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి`` అని అన్నారు.
ఆమీర్‌ఖాన్ పెళ్లిలో నవ్వుతారా? ఎమోషనల్ అయి కంటతడిపెట్టుకుంటారా? అనే డిస్కషన్ జరుగుతోందట ఫ్యామిలీలో. ఐరా ఖాన్, ఆ రోజు తన తండ్రిని చూడటానికి ఎక్సయిటింగ్‌గా ఉందని అంటున్నారు. ఆమీర్‌ఖాన్ మాజీ భార్య రీనా దత్తాకు జన్మించారు ఐరాఖాన్.