English | Telugu

జాయింట్ ఫ్యామిలీస్ గురించి క‌త్రినా హ‌జ్బెండ్ ఏమంటున్నారు?

క‌త్రినా కైఫ్ భ‌ర్త, విక్కీ కౌశ‌ల్ న‌టించిన సినిమా ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ. ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌లైంది. జాయింట్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, అందులోని స‌భ్యులు ఎలా ఉంటారు అని చెప్పే సినిమా ఇది. వాళ్ల మ‌ధ్య బాండింగ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు నిర్మాత‌లు. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి అఫిషియ‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. సెప్టెంబ‌ర్ 22న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది ఈ సినిమా. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భ‌జ‌న్‌కుమార్ అనే పాత్ర‌లో న‌టించారు విక్కీ కౌశ‌ల్‌. ప‌ద్ధ‌తులున్న హిందూ ఫ్యామిలీలో పుట్టిన వ్య‌క్తి భ‌జ‌న్ కుమార్‌. ఓ స్మాల్ టౌన్‌లో ఉంటారు.

ఉమ్మ‌డి కుటుంబాల మ‌ధ్య అనుబంధాలు ఈ సినిమాలో క‌నిపిస్తాయి. ఉమ్మ‌డి కుటుంబాల్లో ఒక‌రికొక‌రి మ‌ధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో చూపించారు. ఉన్న‌ట్టుండి భ‌జ‌న్‌కుమార్ కి త‌న పుట్టుకకు సంబంధించిన ఓ ర‌హ‌స్యం తెలుస్తుంది. దాని వ‌ల్ల ఏం జ‌రిగింద‌నేది ఈ సినిమాలో కీల‌కం. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాలోకి ఎమోష‌న్స్ కి క‌నెక్ట్ అవుతార‌ని అన్నారు కౌశ‌ల్‌. సెప్టెంబ‌ర్ 22న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ. మానుషి చిల్ల‌ర్‌, మ‌నోజ్ పహ్వ‌, కుముద్ మిశ్ర‌, సాదియ సిద్ధిఖీ, అల్క అమీన్‌, సృష్టి దీక్షిత్‌, భువ‌న్ అరోరా, అషుతోష్ ఉజ్వ‌ల్‌, భార్తి పెర్వానీ కీలక పాత్ర‌ల్లో న‌టించారు.