English | Telugu

క‌ళ‌రిప‌య‌ట్టు నేర్చుకున్న సుష్మిత‌


సుష్మిత సేన్‌, సికంద‌ర్ ఖేర్ న‌టించిన వెబ్‌సీరీస్ ఆర్య‌. ఆల్రెడీ రెండు సీజ‌న్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సీజ‌న్ కోసం డేట్ ఫిక్స్ చేశారు మేక‌ర్స్. సుష్మిత ఈ సారి మరింత ఫోర్స్‌ఫుల్‌గా క‌నిపిస్తార‌ని అన్నారు మేక‌ర్స్. జులై 2023న విడుద‌ల కానుంది ఆర్య లాస్ట్ సీజ‌న్‌. రామ్ మద్వానీ దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సీరీస్‌లో అద్భుత‌మైన రోల్ చేస్తున్న సుష్మిత ఈ సారి జ‌నాల‌ను మ‌రింత‌గా మెప్పిస్తార‌ని అన్నారు మ‌ద్వాని.

థ‌ర్డ్ సీజ‌న్‌ని ఈనెల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‌ని అన్నారు. ప‌ర్ఫెక్ట్ తేదీని త్వ‌ర‌లోనే అనౌన్స్  చేస్తామ‌ని చెప్పారు. డిస్నీ హాట్‌స్టార్‌లో ప్లే అవుతుంది ఆర్య ఈ సీరీస్ కోసం ప‌ర్టిక్యుల‌ర్‌గా సుష్మిత యాక్ష‌న్ స్టంట్స్ నేర్చుకున్నారు. క‌త్తుల పోరాటాన్ని ప్ర‌త్యేకంగా అభ్య‌సించారు. ఆర్య‌3 కోసం ఆమె క‌ళ‌రిప‌య‌ట్టు కూడా నేర్చుకున్నారు. మ‌ల‌యాళ క‌ళ‌రిప‌య‌ట్టుతో ఈ సీరీస్‌కి ఏం సంబంధం అంటూ కూపీలాగుతున్నారు నెటిజ‌న్లు. గ‌త రెండు సీరీస్‌ల‌క‌న్నా మించేలా ఉంటుంది ఈ సీరీస్ అని అంటున్నారు మేక‌ర్స్. సుష్మిత కూడా ఈ సీరీస్ మీద స్పెష‌ల్ ఫోక‌స్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పబ్లిసిటీ కోసం మీడియా ముందుకు రానున్నారు సుష్మిత సేన్‌.