English | Telugu
రణ్‌వీర్ - ఆలియా సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోందా?
Updated : Aug 2, 2023
రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. రణ్‌వీర్ సింగ్, ఆలియా జంటగా నటించిన సినిమా రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ. ఏడేళ్ల గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన సినిమా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టి పాతికేళ్లు అయిన సందర్భంగా విడుదలైంది ఈ సినిమా. తన ఓన్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ మీద తెరకెక్కించారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. టైటిల్ రోల్స్ లో రణ్‌వీర్, ఆలియా మెప్పించబట్టి, మాసివ్ సక్సెస్ అందుకుంది. జులై 28న విడుదలైన ఈ సినిమా ఇంకా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీక్వెల్ ఉంటే, కథ ఏ మలుపు తీసుకుంటుందనే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. నటీనటులు, దర్శకుడు కూడా ఈ సీక్వెల్‌కి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఐడియా బడ్డింగ్ స్టేజ్‌లో ఉందని అంటున్నారు కరణ్ జోహార్.
దీని గురించి కరణ్ మాట్లాడుతూ ``రాఖీ, రాణీ పెళ్లయిన తర్వాత కుటుంబసభ్యులతో ఉంటారని నేను అనుకోవడం లేదు. వాళ్లిద్దరూ విడిగా ఉన్నప్పటికీ, కుటుంబసభ్యులను బాగా చూసుకుంటారు. దాన్ని బట్టి సీక్వెల్‌కి కథను అల్లుకోవాలి`` అని అన్నారు. పంజాబీ అబ్బాయికి, బెంగాలీ గర్ల్ కీ మధ్య ప్రేమ, ఆ ఇరువురి కుటుంబాల కలయికతో సాగుతుంది ఈ సినిమా. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ, టోటా రాయ్ చౌదరి, ఆమిర్ బషీర్, చుర్ని గంగూలీ, క్షితీ జోగ్, అంజలి ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు.