Read more!

English | Telugu

విజయ్ దేవరకొండను దక్కించుకునేది ఎవరు?

 

విజయ్ దేవరకొండ కి హిట్ లు ఎంత ఫాస్ట్ గా వచ్చాయో..ప్లాప్ లు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చాయి. 2018 లో వచ్చిన గీత గోవిందం, టాక్సీ వాలా  తర్వాత నో హిట్స్. అంటే విజయ్ హిట్ కొట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా డిజప్పాయింట్  గా ఉన్నారు. ఎందుకు మా విజయ్ కి హిట్ రావడం లేదని మదన పడుతున్నారు. కొంత మంది అయితే నువ్వు పలానా  సినిమా చెయ్యి అని సలహాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళ సలహాలకి తగ్గట్టే ఫుల్ మాస్ సబ్జట్స్ తో కూడిన  రెండు భారీ ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసాడు.వాటిల్లోని  ఒక మూవీ  హీరోయిన్ విషయం టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది

రాహుల్ సంక్రుత్యన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ సినిమాలు చేయబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రెండు సినిమాల పోస్టర్స్ అయితే ఒక దానిని మించి ఒకటి ఉన్నాయి. దీంతో  ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు కంప్లీట్ అవుతాయా అని  ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక  రవి కిరణ్ మూవీ పక్కా రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. హీరోయిన్ కి ఎంతో ప్రాధాన్యత ఉండబోతుంది. సమంత, సాయి పల్లవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సమంత కి మాట ఇచ్చాడని ఖుషి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. పైగా సమంత కి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిన రంగ స్థలంలో నటించిన అనుభవం కూడా  ఉదని అంటున్నారు. ఇక కొంత మంది అయితే సాయి పల్లవి అయితే బాగుంటుందని పైగా విజయ్, సాయి పల్లవి ఫస్ట్ కాంబో ఆడియెన్స్ కి ఫ్రెష్ నెస్ ని తెస్తుందని అంటున్నారు. 

పైగా సాయిపల్లవి చేస్తున్న తండేల్ ,గతంలో చేసిన విరాట పర్వం  ఆ కోవలోకే వస్తాయని  అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయ్ కి జోడి కడతారో చూడాలి.  మూవీ అయితే  తర్వలోనే షూటింగ్ కి వెళ్లనుంది.  విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ  బడ్జట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో మొన్న ఏప్రిల్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ పరాజయం పాలయ్యింది