Special Sambar

 

 

 

స్పెషల్ సాంబార్

 

 

 

కావల్సిన పదార్థాలు
కప్పు కంది పప్పు - ½ కప్పు
ఎర్ర కందిపప్పు -  ½ కప్పు
పొట్లకాయ - 1
క్లస్టర్ బీన్సు -  5
 బెండకాయలు - 6
చేమగడ్డలు - 6 (చిన్న సైజు)
వంకాయ - ఒకటి
దోసకాయ - ఒకటి
ములగకాయలు -   2
బంగాళదుంప - 1 
పెద్ద ఉల్లిపాయ - 1
టమోటో -   1
చిన్న ఉల్లిపాయలు -  10
టేబుల్ స్పూన్ ల సాంబార్ పొడి -3
ఎండు మిరపకాయలు - 3
చింతపండు రసం-  ¼ కప్పు
టేబుల్ స్పూన్ ల ఆయిల్
ఆవాలు -1 టేబుల్ స్పూన్
ఇంగువ-1 చిటికెడు
ఉప్పు - సరిపడా
కరివేపాకు - కొద్దిగా
కొత్తమీర - ఒక కట్ట

 

తయారు చేసే విధానం
ముందుగా  కూరగాయలను ముక్కలుగా కట్  చేసి  ఒక  కుక్కర్లో ఉంచండి. పప్పులు, పసుపు, ఉప్పు మరియుసరిపడా  నీటిని పోసి  నాలుగు  విజిల్ వచ్చే వరకు   ఉడికించాలి. తరువాత  2 నుంచి 3 టేబుల్ స్పూన్ల సాంబారు పొడి, చింతపండు రసం నీళ్ళు మరియు ఇంగువ వేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇప్పుడు వేరొక గిన్ని తీసుకుని నూనెలో ఆవాలు, ఎండుమిర్చి మరియు కరివేపాకులతో పోపు వేసి మరుగుతున్న సాంబార్ ని పోపు లో వెయ్యాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ,కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఘుమఘుమలాడే సాంబార్ రెడీ