వెల్లుల్లి రసం

 

వెల్లుల్లి రసం

కావాల్సిన పదార్ధాలు:

నానబెట్టిన చింతపండు - నిమ్మకాయంత

టమోటా- 1 తరిగినది

పచ్చిమిర్చి - 2

వెల్లుల్లి రెబ్బలు - 20

నూనె - 2 టేబుల్ స్పూన్స్

జీలకర్ర - అర టీస్పూన్

ఆవాలు - అర టీస్పూన్

ఎండుమిర్చి - 2

ఉప్పు -తగినంత

ఇంగువ - పావు టీ స్పూన్

కరివేపాకు - ఒక రెమ్మ

పసుపు - పావు టీస్పూన్

కారం -అర టీస్పూన్

నీళ్లు -తగినన్ని

కొత్తిమీర - పిడికెడు

మసాలపొడికి కావాల్సిన పదార్థాలు

మెంతులు - పావు టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

ధనియాలు - 1 టీస్పూన్

కందిపప్పు - 2 టీస్పూన్స్

నువ్వులు - 1 టీ స్పూన్

తయారీ విధానం:

ముందుగా కడాయిలో మసాలా పొడికి కావాల్సిన పదార్థాలన్నీ వేయించుకోవాలి. తర్వాత వాటిని జార్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టి గిన్నెలోనే టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి నలిపి రసాన్ని తీసుకోవాలి. రోటిలో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం, నీళ్లు ముందుగా తయారు చేసుకున్న పొడివేసి కలపాలి. దీనిని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించి ఆ తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి రసం రెడీ. దీని అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.