masala tamato curry

 

 

 

 మసాలా  టొమోటో కర్రీ

 

 

 

కావలసిన పదార్థాలు:
టొమోటోలు: అర కేజీ
నూనె: సరిపడా
గసగసాలు: 2 tsp
జీడిపప్పులు: 20 గ్రాములు
నువ్వులు: 2 tsp
చింతపండు: కొద్దిగా
ఉల్లిపాయలు: 4
ఉప్పు, కారం: సరిపడా
పసుపు: తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 tsp
మసాలా పౌడర్: 2 tsp
కొత్తిమీర: ఒక కట్ట

 

తయారు చేయు విధానం:
ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, కొన్ని ఉల్లిపాయల ముక్కలు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి.
పావు గంట ముందు నానబెట్టుకున్న చింతపండు ఉప్పు, కారం వేయించి పక్కన పెట్టుకున్నవాటిని కలిపి  మిక్సీలో వేసి మెత్తగా  పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు  పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి. తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
 టమాటాలు బాగా మగ్గిన  తరువాత మసాలాను పేస్ట్ వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు ఉడికించాలి.ఇప్పుడు మసాలాపొడి వేసి బాగా కలిపి. కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. మసాలా టమాటో కర్రీ రెడీ...