రాగులతో వెజ్ సూప్

 

రాగులతో వెజ్ సూప్

కావాల్సిన పదార్థాలు:

రాగిపిండి - 2స్పూన్స్

బటర్ - స్పూన్

వెల్లుల్లితరుగు- అరటీస్పూన్

ఉల్లిపాయ తరుగు - పావు కప్పు

తరిగిన క్యారెట్ ముక్కలు -పావు కప్పు

బీన్స్ - పావుకప్పు

స్వీట్ కార్న్ - పావు కప్పు

టమటా ముక్కలు - పావు కప్పు

నీళ్లు -ఒకటిన్నర గ్లాస్

ఉప్పు -రుచికి సరిపడా

మిరియాల పొడి - అర టీస్పూన్

వెనిగర్ - టీస్పూన్

తయారీ విధానం:

- ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి ఉండలుగా లేకుండా కలుపుకుని పక్కనపెట్టాలి. తర్వాత కళాయిలో బటర్ వేసి వేడి చేయండి.

- బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు, స్వీట్ కార్న్ వేసి వేయించాలి.

- పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు కలుపుతుండాలి. తర్వాత ఉప్పు, నీళ్లు, మిరియాల పొడి, వేసి కలపాలి.

- నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా కలిపి పక్క పెట్టుకున్న రాగి పిండిని వేసి కలపాలి. తర్వాత వెనిగర్ వేసి కలిపాలి.

- కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఇలా చేస్తే ఎంతో రుచికరమైన రాగి సూప్ రెడీ.