చెట్టినాడ్ఇడ్లిపొడి
చెట్టినాడ్ఇడ్లిపొడి
కావాల్సిన పదార్థాలు:
మినప్పప్పు - 1/2 కప్పు,
శనగపప్పు - అర కప్పు,
కందిపప్పు - అర కప్పు,
ఎర్ర మిర్చి- 15,
అల్లం నూనె - రెండు టీ స్పూన్లు,
ఇంగువ - ఒక టీ స్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా,
కరివేపాకు - అరకప్పు,
రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
పాన్ వేడి చేసి అందులో ఎండు మిర్చి వేసి సన్నని మంటమీద 5 నిమిషాలు వేయించాలి. తర్వాత ఉప్పు, ఇంగువ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు పాన్ లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి.
అదే పాన్ లో హాఫ్ టీ స్పూన్ నూనె వేసి ముందు మినపప్పుని..గోధుమ రంగులో వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
మిగతా పప్పులను కూడా అలాగే వేయించి పక్క పెట్టుకోండి.
ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్నంతా గ్రైండర్ లో వేసి బరకగా పొడిగా చేసుకోండి. మెత్తగా కావాలి లేదంటే బరకగానే బాగుంటుంది.
వేడివేడి ఇడ్లీలోకి నెయ్యితో ఈ చెట్టినాడు ఇడ్లీ పొడి కలుపుకొని తింటుంటే రుచిగా ఉంటుంది.