మొక్కజొన్న గారెలు
మొక్కజొన్న గారెలు
కావాల్సిన పదార్ధాలు:
నానబెట్టిన మొక్కజొన్నగింజలు - 2కప్పులు
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం - అర ఇంచు ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4
జీలకర్ర - అర టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్
పుదీనా - 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - పావు టీ స్పూన్
చాట్ మసాలా - పావు టీ స్పూన్
పసుపు - కొద్దిగా
నూనె - డీప్ ఫ్రై కోసం
తయారీ విధానం:
- ముందు నానబెట్టిన మొక్కజొన్న గింజలను వడకట్టుకుని మిక్సీ పట్టుకోవాలి.
- ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా చల్లుకోవచ్చు. అన్నింటికీ ఉప్పు పట్టేలా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసుకుని కలుపుకోవాలి.
- కళాయిలో నూనె పోసి వేడిచేసుకోవాలి.
- నూనె బాగా వేడయ్యాక కొద్దికొద్దిగా పిండి తీసుకొని గారేలులాగా చేతి పైన ఒత్తుకొని, నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ.
- గారెలు మరీ మందంగా మరీ పలుచగా కాకుండా వత్తుకోవాలి.
నోట్: 1. మొక్క జొన్న మరి ముదురు గా ఉన్నది కాకుండా లేతది తీసుకుంటే గారెలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి.
2. పిండి పట్టేటప్పుడు మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటేనే తినేప్పుడు మొక్క జొన్న రుచి నోటికి తగులుతుంది.