Ragi Vada

 

రాగి వడ

 

 

కావలసిన పదార్ధాలు:

రాగి పిండి -  1 కప్పు

వేరుశెనగ గుళ్ళు - 1/2 కప్పు

వేయించిన శెనగపప్పు (పుట్నాల పప్పు) - 1/2 కప్పు

ఉల్లిపాయ (మీడియం సైజు) - 1 

పచ్చిమిర్చి - 4 

కరివేపాకు - 3 రెమ్మలు 

కొత్తిమీర - 1 కట్ట

ఉప్పు - రుచికి తగినంత

నూనె - డీప్ ఫ్రై చేయడానికి కావాల్సినంత

 

తయారుచేయు విధానం:

వేయించిన శెనగ పప్పు, వేరుశెనగ గుళ్ళు మిక్సీ లో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా  పొడి చేసుకోవాలి.

 

ఒక బౌల్ లో రాగి పిండి, పైన చేసిన పప్పుల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి వడ చేయటానికి సరిపడేలా కలుపుకోవాలి.

 

ఒక కడాయిలో నూనె పోసి వేడిచేసుకోవాలి.

 

వడ పిండిని ఉండలా చేసుకొని అరచేతి మీద ఫ్లాట్ గా వత్తుకొని కాగిన నూనెలో వేయాలి.

 

వడలను మీడియం సెగ మీద గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

 

వేడి వేడి రాగి వడలను చట్నీతో సర్వ్ చేయండి.