Pearl Millet Sajja Onion Muttilu

 

 

 

సజ్జ ఉల్లిపాయ ముట్టీలు

 

 

 

కావలసిన పదార్ధాలు:

సజ్జ పిండి - ఒక కప్పు

సన్నటి ఉల్లి తరుగు - అర కప్పు

అల్లం వెల్లుల్లి పచ్చి మిర్చి ముద్ద - అర టీ స్పూను

జీలకర్ర పొడి - 1 టీ స్పూను

నూనె - తగినంత

కరివేపాకు - 4 రెమ్మలు

పసుపు - పావు టీ స్పూను

మిరప కారం - ఒక టీ స్పూను

పంచదార - పావు టీ  స్పూను

ఇంగువ - పావు టీ స్పూను

ధనియాల పొడి - ఒక టీ స్పూను

ఆవాలు - అర టీ స్పూను

బేకింగ్‌ సోడా - కొద్దిగా

జీలకర్ర - అర టీ స్పూను

ఉప్పు - తగినంత

క్యారట్‌ తురుము - అలంకరించడానికి తగినంత

కొత్తిమీర - అలంకరించడానికి తగినంత

 

తయారుచేసే విధానం:  

ఒక పాత్రలో సజ్జ పిండి, ఉల్లి తరుగు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద, పంచదార, బేకింగ్‌ సోడా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి పిండిని ముద్దగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పొడవుగా సన్నగా ఒత్తాలి. స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి జాగ్రత్తగా కలపాలి. అర కప్పు నీళ్లు జత చేసి, కొద్దిగా కలిపి, సన్నటి మంట మీద సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికాయా లేదా అని టూత్‌ పిక్‌తో గుచ్చి పరిశీలించాలి. ఉడికిన వెంటనే దింపేసి కొత్తిమీర, క్యారట్‌ తురుములతో అలంకరించి, వేడివేడిగా అందించాలి.