Local Kitchen - Sorakaya Payasam and Chicken Balls
సొరకాయ పాయసం :
తయారు చేయవలసిన పధ్ధతి:
ముందుగా జీడిపప్పు, ఎండు ద్రాక్షను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో తురిమిన సోరకాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకో వైపు పాలు వేడి చేసుకోవాలి. సొరకాయ బాగా వేగాక వేడి పాలలో సొరకాయను కలపాలి. అలా దగ్గరపడేంత వరకు ఉడకనిచ్చి అందులో చెక్కెర కలపాలి. చెక్కెర కరిగాక ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న జీడి పప్పు, ఎండు ద్రాక్షను కలపాలి. ఆ తరవాత యాలకుల పొడితో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ పాయసం రెడీ.
చికెన్ బాల్స్
తయారు చేసే విధానం :
గిన్నెలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి స్టవ్ పై పెట్టాలి. అది వేడయ్యే లోపు చికెన్ లో ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్(జిలకర, పచ్చిమిర్చి కూడా కలిపి), కలుపుకోవాలి.
ఆ తరవాత చిన్న చిన్న బాల్స్ లా చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఫ్లేం తక్కువగా ఉండటం మంచిది. ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, క్యారట్ తో గార్నిష్ చేసుకుంటే చికెన్ బాల్స్ రెడీ.