Read more!

బియ్యం పిండి గారెలు!

 

బియ్యం పిండి గారెలు!

కావాల్సిన పదార్థాలు:

బియ్యం పిండి- (మనకు కావాల్సిన పరిమాణంలో తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగా మిగతావి తీసుకోవాలి)

శనగపప్పు

పల్లీలు

నవ్వులు

ఉప్పు

కారం

ఉల్లిఆకు

కొత్తిమీర

కరివేపాకు

తయారీ విధానం:

బియ్యం పిండి గారెలను తయారు చేసే ముందు బియ్యాన్ని పిండిగా పట్టించుకోవాలి. తర్వాత మనకు ఎంత పరిమాణంలో గారెలు కావాలో అందుకు తగ్గ పరిమాణంలో ఒక పెద్ద పాత్రలో బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో శనగపప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు, నువ్వులను వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని కలపాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోస్తూ పిండిని మొత్తం కలియగలపాలి. మరీ పలుచగా కాకుండా ముద్దగా తయారయ్యే విధంగా కలపాలి. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చిన్న చిన్న ఉండలను తీసుకుని పూరి వలె ప్రెస్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పిండి ఉండలు గుండ్రంగా వెడల్పుగా తయారు అవుతాయి.

ఇప్పుడు స్టవ్ పైనా కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక అందులో వేస్తూ కాల్చుకోవాలి. కడాయి పెద్దదిగా ఉంటే ఒకసారి నాలుగు లేదా ఐదు గారెలను వేయించుకోవచ్చు. విటిని ఎర్రగా మారే వరకు నూనెలో వేయించుకోవాలి. వాటిని తీసి ఓ ప్లేటులో పెట్టుకోవాలి. అంతే సింపుల్ బియ్యం పిండి గారెలు రెడీ.