పనస పండు పాయసం
పనస పండు పాయసం
కావాల్సిన పదార్థాలు:
పనస పండు తొనలు - 30 నుంచి 40 వరకు తీసుకోవాలి.
బెల్లం - 30 గ్రాములు
చిక్కని కొబ్బరి పాలు - ఒక కప్పు
పల్చని కొబ్బరిపాలు - 2కప్పులు
కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు -మీకు నచ్చినంత
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఎండు అల్లం పొడి - చిటికెడు
ఉప్పు -చిటికెడు
తయారు విధానం:
ముందుగా పనస తొనలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత బయటకు తీసి చల్లార్చాలి.
దానిని చిక్కటి మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత పనస పండు పేస్ట్ వేసి బాగా కలపాలి.
సన్నని సగం మంట మీద 20 నిమిషాలు వరకు అలా కలుపుతూనే ఉండాలి.
ఇప్పుడు కరిగించిన బెల్లం వేసి మరో 10 నిమిషాలు కలుపుతూ ఉండాలి.
తర్వాత పలుచని కొబ్బరిపాలు పోయాలి. తర్వాత చిక్కని కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా కలుపుతుండాలి.
తర్వాత కొంచెం అల్లం పొడి వేసి మరో రెండు నిమిషాలు బాగా కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి.
తర్వాత వేయించిన జీడిపప్పు, కొబ్బరి ముక్కలను అందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుని తర్వాత దించి పక్కన పెట్టుకోండి.
వేడి వేడి పనస పండు పాయసం సిద్ధం.
పాయసం చిక్కబడిందనిపిస్తే కొంచెం కొబ్బరిపాలు వేస్తూ పలుచగా కూడా చేసుకోవచ్చు.