అటుకుల పాయసం

 

 

అటుకుల పాయసం

 

కావాలసిన పదార్ధాలు:

అటుకులు -1 కప్పు

పాలు - 2 కప్పులు

బెల్లం తురుము - 1 కప్పు

నీళ్లు - 2 కప్పులు

ఎండుకొబ్బరి తురుము -3 కప్పులు

యాలకుల పొడి - 1/3 టీ స్పూన్

జీడిపప్పులు - 5

నెయ్యి - 2 స్పూనులు

బాదం పప్పులు - 5

తయారీ విధానం:

1. పేనం తీసుకుని అందులో అటుకులు వేసి వేయించి పక్కకి తీసుకుపెట్టుకోవాలి.

2. అదే కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పులు, ఎండుకొబ్బరి తురుము వేసి వేయించాలి.

3. అదే కడాయిలో బెల్లం, నీళ్లు వేసి కరిగే వరకు ఉడికించాలి.

4. ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి.

5. పాలు మరిగిర తర్వాత అటుకులను వేసి ఉడికించాలి.

6 అటుకుల మెత్తగా అయ్యేవరకు ఉడికించాక బెల్లం నీళ్లు అందులో కలపాలి.

7. ఇప్పుడు యాలకుల పొడిని అందులో కలపాలి. 8 కడాయిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం, కొబ్బరి ముక్కలు అటుకుల కూడా ఇందులో వేయాలి. 9 చిక్కగా పాయసంలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి.