Little Millet Saamala Tomato Pulao

 

 

 

సామల టొమాటో పులావ్‌

 

 

 

కావలసినవి:

సామలు - 1 కప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
తరిగిన పచ్చి మిర్చి - 2
నెయ్యి  లేదా నూనె - 2 టీ స్పూన్లు  
కరివేపాకు - 2 రెమ్మలు
అల్లం తురుము - 1 స్పూను
క్యారట్‌ తరుగు - 1 టేబుల్‌ స్పూను
పచ్చి సెనగ పప్పు - 1 టీ స్పూను
మినప్పప్పు - 1 టీ స్పూను
అల్లం తురుము - 1 టీ స్పూను
టొమాటో తరుగు - పావు కప్పు
ఆవాలు - 1 టీ స్పూను
మిరప కారం - పావు టీ స్పూను
నీళ్లు - తగినంత
ఉప్పు - తగినంత
పసుపు - పావు టీ స్పూను
ఉడికించిన బఠాణీ - 1 కప్పు
కొత్తిమీర - 1 టేబుల్‌ స్పూను

 

తయారుచేసే విధానం:

సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్‌ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, పసుపు, మిరప కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి... చాలా రుచిగా ఉంటుంది.