Kodo Millet - Arikela Attu

 

 

 

అరికల అట్టు

 

 

 

కావలసిన పదార్ధాలు:

అరికలు - అర కప్పు 

కంది పప్పు - పావు కప్పు

సోంపు - ఒక టీ స్పూను

పచ్చి సెనగ పప్పు - పావు కప్పు

పెసర పప్పు - ఒక టీ స్పూను

మినప్పప్పు - ఒక టీ స్పూను

ఎండు మిర్చి - 2

ఉల్లి తరుగు - పావు కప్పు

పుదీనా తరుగు - ఒక టేబుల్‌ స్పూను

పెసర పప్పు - ఒక టీ స్పూను

అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను 

కొత్తిమీర తరుగు - ఒక టేబుల్‌ స్పూను

ఉప్పు - తగినంత

 

తయారు చేసే విధానం:

ఒక పెద్ద గిన్నెలో అరికలు, పచ్చి సెనగ పప్పు, పెసర పప్పు, కంది పప్పు, మినప్పప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి 4 గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో ఎండు మిర్చి, సోంపు జత చేసి మరోమారు గ్రైండ్‌ చేసి, ఇడ్లీపిండికి, దోసెల పిండికి మధ్యరకంగా రుబ్బి, పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి, మూత పెట్టి సుమారు గంటసేపు పిండిని నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, గరిటెతో పిండి తీసుకుని పెనం మీద దోసె మాదిరిగా వేయాలి. అంచులు గోధుమరంగులోకి వచ్చాక ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి అలంకరించి దోసెను మధ్యకు మడత వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.