Jonna Bhakarwadi Masala

 

జొన్న బాక్రావాడి మసాలా

 

కావలసిన పదార్ధాలు:

జొన్న పిండి - 50 గ్రా

గోధుమ పిండి - 2 టేబుల్‌ స్పూన్లు

సెనగ పిండి - 50 గ్రా

మిరియాల పొడి - 1 టీ స్పూను

సోంపు పొడి - 1 టీ స్పూను

నువ్వుల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు (వేయించిన)

ఉప్పు - తగినంత

నీళ్లు - తగినన్ని

బాదం పప్పుల పొడి - 1 టేబుల్‌ స్పూను

జీడిపప్పుల పొడి - 1 టేబుల్‌ స్పూను

జీలకర్ర పొడి - 1 టీ స్పూను

మిరప కారం - 1 టీ స్పూను

ధనియాల పొడి - 1 టీస్పూను

చాట్‌ మసాలా - 1 టీ స్పూను

నూనె - 1 టేబుల్‌ స్పూను

గసగసాల పొడి - 1 టీ

 

తయారుచేసే విధానం:

ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెనగ పిండి ఒకటిగా కలిపి జల్లెడపట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా కలపాలి. తగినన్ని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలిపి ఉండలు చేసుకోవాలి. ఒక పాత్రలో అన్ని పొడులను వేసి బాగా కలియబెట్టాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తాలి. తయారుచేసి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ మీద వేసి, చపాతీని రోల్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి అన్ని పొరలకు అంటుతుంది.  రోల్‌ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.