Corn kofta curry
కార్న్ కోఫ్తా కర్రీ
కావలసినవి :
మొక్కజొన్న గింజలు : రెండు కప్పులు
టమాటో గుజ్జు : రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి : టీ స్పూను
పెరుగు : కప్పు
కొత్తి మీర : ఒక కప్పు
గరం మసాలా : అర స్పూన్
ఉల్లిపాయలు : రెండు
పచ్చి మిర్చి : నాలుగు
ఉప్పు : తగినంత
కారం : సరిపడగా
ధనియాలు : టీ స్పూను
పన్నీర్ : యాభై గ్రాములు
నూనె : తగినంత
ఉల్లిపాయలు : రెండు కప్పులు
తయారు చేసే విధానము :
ముందుగా మొక్కజొన్న గింజలను మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు , పచ్చి మిర్చి , ఉల్లిపాయలు ముక్కలు, కొత్తిమీర, పన్నిర్ తురుము వేసి కలిపి ఈ పిండి తో కోఫ్తా లు చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి కాగాక ఈ కోఫ్తాల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి.ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ , కారం, ధనియాలపొడి , వేసి కలపాలి.తరువాత టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె పైకి వచ్చాక అందులో పెరుగు కలిపి కొద్దిసేపు ఉడికించి కొత్తిమీర , గరం మసాలా వేసి అందులో కోఫ్తా లను వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.