Capsicum paneer Curry

 

 

 

క్యాప్సికం పన్నీర్ కర్రీ రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు :
క్యాప్సికం              -          400 గ్రా.
పన్నీర్                 -          50 గ్రా.
యాలకులు          -            3
దాల్చిన చెక్క        -           చిన్న ముక్క
సోంపు                 -           అరటీస్పూన్
జీలకర్ర                 -          టీస్పూన్
కారం                   -          2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి      -          ఒకటిన్నర టీస్పూన్లు
ఉల్లిపాయలు          -           5
అల్లం వెల్లుల్లి ముద్ద -           2 టీస్పూన్లు
పసుపు               -            3 చిటికెలు
చింతపండు           -           కొద్దిగా
లవంగాలు            -           4
నూనె                  -          సరిపడగా
ఉప్పు                  -          తగినంత
వేరుసెనగ పప్పు     -         ఒక  కప్పు
కొత్తిమీర               -          కొంచం
పుదీనా                -          కొంచం
కరివేపాకు             -          కొద్దిగా
తెల్ల నువ్వులు       -           2 టీస్పూన్లు

 

తయారుచేసే పద్ధతి :
ముందుగా  ఉల్లిపాయలు,క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి.

 

తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి  వేరుసెనగ పప్పులు,నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్ ను విడివిడిగా వేయించుకోవాలి.

ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసిదాల్చిన చెక్క, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి.

తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్  కొద్దిగా నీళ్ళు వేసి ఉడకనివ్వాలి .ఇప్పుడు  ధనియాల పొడి,కారం వేసి  పది నిముషాలు ఉడికించాలి.

చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిముషాలు ఉకించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి