Read more!

కాజు ప‌నీర్‌

 

కాజు ప‌నీర్‌

కావాల్సిన పదార్థాలు:

టమాటాలు - 2 పెద్దవి

జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్స్

నూనె - 2 టేబుల్ స్పూన్స్

దాల్చిన చెక్క - 1 ఇంచు

లవంగాలు - 3

యాలకులు - 2

జీలకర్ర - అర టీస్పూన్

ఉల్లిపాయలు - 2 చిన్నగా తరిగినవి

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1టేబుల్ స్పూన్

పసుపు - అర టీస్పూన్

జీలకర్ర పొడి -అర టీస్పూన్

ధనియాల పొడి - 1 టీస్పూన్

కారం - ఒకటిన్నర టీ స్పూన్

గరం మసాలా - అర టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్స్

నీళ్లు - అర కప్పు

పనీర్ - 250 గ్రాములు

జీడిపప్పు - వేయించినది పావు కప్పు

బటర్ - 2 టేబుల్ స్పూన్స్

కసూరి మెంతి - 1 టీస్పూన్

కొత్తిమీర -తరిగినది కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా జార్ లో టమాటాలు, జీడిపప్పు వేసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత బాణాలిలో నూనె వేసి వేడిచేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలి.

తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.

తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి.

వీటిని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత గ్రైండ్ పట్టుకోవాలి. దీనిపై మూతపెట్టి నీళ్లు పోసి కలుపుకోవాలి.

తర్వాత పనీర్ వేసి వేయించిన జీడిపప్పు, బటర్ వేసి కలుపుకోవాలి.

తర్వాత మూతపెట్టి నూనె పైకి వచ్చేంత వేయించాలి.

తర్వాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు పనీర్ కర్రీ రెడీ అవుతుంది.