Capsicum Pachadi
కాప్సికం పచ్చడి
కావలసిన పదార్థాలు:
కాప్సికం ముక్కలు - 1 కప్పు
పసుపు - ½ టీ స్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - ½ టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద - ½ టేబుల్ స్పూన్
చింతపండు రసం - ½ కప్పు
జీలకర్ర పొడి - ¼ టేబుల్ స్పూన్
మెంతి పొడి - ¼ టేబుల్ స్పూన్
జీలకర్ర - ¼ టీ స్పూన్
మెంతులు - ¼ టీ స్పూన్
నూనె - ½ కప్పు
తయారుచేసే విధానం:
1. ముందుగా ఒక బాణలిలో నూనె పోసి జీలకర్ర, మెంతులు వేసి వేపాలి. మెంతులు వేగిన తరువాత కాప్సికం ముక్కలు వేసి, మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
2. తరువాత దీనిలో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, అల్లం వెల్లులి ముద్ద వేసి కలపాలి.
3. తరువాత చింతపండు పులుసు వేసి కలపాలి. చింతపండు పులుసులో నీళ్ళన్నీ ఇగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి.
4. ఈ పచ్చడి అన్నం, చపాతీ, పూరీ లోకి బావుంటుంది. ఈ పచ్చడి నాలుగయిదు రోజులు నిల్వ వుంటుంది.