క్యాబేజీ పచ్చడి

 

 

క్యాబేజీ పచ్చడి

 

కావాల్సిన పదార్థాలు:

నూనె - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర - అర టీ స్పూన్

ధనియాలు - 1 టీస్పూన్

పచ్చిమిర్చి - 10 లేదంటే మీకు కావాల్సినన్ని తీసుకోండి

ఎండు మిర్చి - 4

వెల్లుల్లి రెబ్బలు - 5

క్యాబేజి తరుగు- 150 గ్రాములు (సన్నగా తరుగుకోవాలి)

పసుపు - పావు టీ స్పూన్

చింతపండు - ఉసిరికాయంత

టమాటాలు - 3

ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టాలి. అది వేడయ్యాక...నూనె పోసి జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ తరుగు, పసుపు వేసి కలుపుకోవాలి. వీటిపై మూతపెట్టి క్యాబేజీని పూర్తిగా మగ్గించుకోవాలి. క్యాబేజీ వేగిన తర్వాత చింతపండు, టమాట ముక్కలు వేసుకోవాలి. వీటిని మీడియం మంటపై కలపుతూ టమాట ముక్కలు మెత్తగాఉడికే వరకు మగ్గించుకోవాలి. తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత కడాయిలో నూనె వేసి వేడి చేసి..అందులో తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి రెడీ అవుతుంది.