నిమ్మకాయ కారం పచ్చడి

 

నిమ్మకాయ కారం పచ్చడి

కావాల్సిన పదార్థాలు:

నిమ్మకాయ‌లు - 3

నూనె - 2 టీ స్పూన్స్

మెంతులు - పావు టీస్పూన్

మిన‌పపప్పు - 3 టీ స్పూన్స్

ఎండుమిర్చి - 15

ఇంగువ - పావు టీ స్పూన్

ఉప్పు - త‌గినంత‌

ప‌సుపు - పావు టీ స్పూన్

తాళింపునకు కావ‌ల్సిన ప‌దార్థాలు:

నూనె - ఒక టీ స్పూన్

తాళింపు దినుసులు - ఒక టేబుల్ స్పూన్

దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు - 4

క‌రివేపాకు - ఒక రెమ్మ‌

ఎండుమిర్చి - 2

త‌యారీ విధానం:

ముందుగా నిమ్మకాయల నుంచి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. మెంతులు, మినపపప్పు వేసి వేయించుకోవాలి. చిన్న మంటపై దోరగా వేయించాలి. తర్వాత ఎండు మిర్చి, ఇంగువ వేసుకుని వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారపెట్టుకోవాలి. జార్ లో ముందుగా ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ చేయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. తర్వాత నిమ్మరసం, వేసి మరోసారి మిక్సీ చేయాలి. వీటిని గిన్నెలోకి తీసుకుని తాళింపునకు కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తర్వాత వీటిని కారంలో కలపాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన నిమ్మకాయం కారం పచ్చడి రెడీ.