Red Capsicum Chutney

 

 

రెడ్ క్యాప్సికమ్ చట్నీ

 

 

 

కావలసిన పదార్థాలు:

రెడ్ క్యాప్సికమ్స్ - రెండు
ఉల్లిపాయ - ఒకటి
టొమాటో - ఒకటి
ఎండుమిర్చి - నాలుగు
మినప్పప్పు - రెండు చెంచాలు
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు - తగినంత
నూనె - ఒక చెంచా

 

తాలింపు కోసం:

నూనె - ఒక చెంచా
ఆవాలు  - ఒక చెంచా
మినప్పప్పు - ఒక చెంచా
జీలకర్ర - ఒక చెంచా
కరివేపాకు - కొద్దిగా

 

తయారీ విధానం:

క్యాప్సికమ్స్ ని శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి, ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నూనెలో కచ్చాబచ్చాగా వేయించుకోవాలి. టొమాటో, ఉల్లిపాయల్ని కూడా ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలతో పాటు క్యాప్సికమ్ ముక్కలు, ఎండుమిర్చి, మినప్పప్పు, చింతపండు, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక తాలింపు సామాన్లు వేయాలి. వేగాక క్యాప్సికమ్ పచ్చడిని వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఇది టిఫిన్స్ తో పాటు అన్నం లోకి కూడా చాలా బాగుంటుంది.

- Sameera