Browntop Millet-Andu Korrala Uthappam
అండు కొర్రల ఊతప్పం
కావలసిన పదార్ధాలు:
అండు కొర్రలు - పావు కప్పు
అల్లం పచ్చిమిర్చి ముద్ద - 1 టీ స్పూను
నూనె - తగినంత
మినప్పప్పు - 1 టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
టొమాటో తరుగు - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.