Browntop Millet - Andu Korrala Pongal
అండు కొర్రల పొంగలి
కావలసిన పదార్ధాలు:
అండు కొర్రలు - అర కప్పు
నెయ్యి లేదా నూనె - తగినంత
కొబ్బరి పాలు - 2 కప్పులు
పెసర పప్పు - అర కప్పు
మిరియాల పొడి - పావు టీ స్పూను
జీడి పప్పులు - 10
ఉప్పు - తగినంత
కరివేపాకు - 2
జీలకర్ర - ఒక టీ స్పూను
తయారుచేసే విధానం:
పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఒక పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి. స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది.