Bread veg sandwitch
Bread veg sandwitch
కావలసిన పదార్దాలు:
* బ్రెడ్ -2 ముక్కలు
* మయనీస్ -1 స్పూన్
* పుదీనా చట్ని - 1 స్పూన్
* టమాటోసాస్ - 1 స్పూన్
* కూరగాయ ముక్కలు చాలా చిన్నగా తరిగిన లేక తురిమిన కారెట్, సిమ్లామిర్చి, క్యాబేజీ, పాలకూర
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ లో కూరగాయ ముక్కలు వేసి అందులో ... పై మూడు సాస్ లు కలిపి బ్రెడ్ పైన చక్కగా స్ప్రెడ్ చేయాలి . బ్రెడ్ కార్నర్స్ కట్ చేసి అలాగే తినేయవచ్చు . మరో బ్రెడ్ పైన పెట్టి ప్రస్ చేసి సాడివిచ్ గా లేదా ..పై విధంగా రెండు బ్రేడ్స్ మధ్య ఈ కూరగాయలు సాస్ ల మిశ్రమం పెట్టి ..రెండు వైపులా దోరగా బటర్ గాని నేతితోగాని కాల్చుకుని తినవచ్చు. తీపి,కారం ,పులుపు కూరముక్కలు అన్ని కలిసిన ఈ సాండ్ విచ్ చాలా చాలా రుచిగా ఉంటుంది . ఆరోగ్యానికి మంచిదికూడా .. (బ్రౌన్ బ్రెడ్ వాడడం మరీ మంచిది )
- భారతి