Bread Vada
బ్రెడ్ వడలు
ఇడ్లీపిండి మిగిలితే, కాస్త బియ్యం పిండి,మిర్చి అల్లం నూరి పునుకుల్ల వేసుకుంటాము, లేదా ఉతప్పమ్ వేస్తాము. ఈసారి ఇడ్లీపిండి మిగిలితే బ్రెడ్ గారెల్ చేసి చూడండి.
కావలసిన పదార్ధాలు..
* నాలుగు బ్రెడ్ముక్కలు
* ఇడ్లీపిండి
* అల్లం
* పచ్చిమిర్చి
* జీలకర్ర
* మిరియాలు
* కొత్తిమిర
* ఉప్పు
* నూనె
తయారీ విధానం..
* ముందుగా బ్రెడ్ ముక్కలు తీసుకొని.. వాటిని చుట్టూ కట్ చేసి నాలుగు ముక్కలు చేసి పెట్టండి.
* ఇప్పుడు ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, కొత్తిమిర దంచి ఇడ్లీ పిండిలో కలపండి.
* ఒక బాణలి తీసుకొని అందులో నూనె వేసి అది వేడెక్కాక.. ఒక్కో బ్రెడ్ ముక్క తీసుకొని దానిని ఇడ్లీ పిండిలోదళసరిగా ముంచి గారెల్ల వేగ నివ్వండి.
* వేగాక గారెల రుచితో లోపల బ్రెడ్ వేగి బాగుంటుంది. అల్లంపచ్చడి.,కొత్తిమిరపచ్చడితో ఈ గారెలు తింటే ఇంకా బావుంటుంది.
--Kameshwari