Bread Rolls Recipe
బ్రెడ్ రోల్స్
కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ తురుము - ఒక కప్పు
క్యారెట్ తురుము - ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయి ముక్కలు -ఒక కప్పు
ఉడికించిన బంగాళ దుంపలు - రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను
పచ్చి మిర్చి - రెండు
ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు - తగినంత
నూనె - పెద్ద కప్పుతో
బ్రెడ్ స్లైసన్ - 10
తయారు చేసే విధానం:
ముందుగా నూనెలో సన్నగా తరిగిన పచ్చి మిర్చి వేసి, ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. వేగుతుండగా ఉల్లిపాయిలు, క్యారెట్ తురుము కలిపి రెండు నిమిషాలు మూత పెడితే క్యారెట్ మెత్తపడుతుంది. ఇకప్పుడు క్యాబేజీ ఉడికించిమెత్తగా చేసిన ఆలూ కలిపి పైన ఉప్పుజల్లి కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాలు మధ్యమధ్యలో కదుపుతూ వుంటే కూర సిద్ధమయిపోతుంది. ఇకప్పుడు బ్రెడ్ అంచులు కట్ చేసి పాలలో ముంచి మధ్యలో పై కూరని రోల్ చేసి నూనెలో వేయించాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ బ్రెడ్ రోల్స్.
-రమ