Bread Paneer Tikka (HOLI Special)
బ్రెడ్ పనీర్ టిక్కా (హోళీ స్పెషల్)
కావలసినవి:
బ్రడ్ - 10 స్లైసులు
పన్నీరు - 200 గ్రా
ఆలు - 1
సిమ్లా మిర్చి ముక్కలు - 1/4 కప్పు
ఉల్లిముక్కలు - 1/4 కప్పు
కారెట్ తురుము - 1/4 కప్పు
ఉప్పు - 1 చెంచా
చాట్ మసాలా - 1/2 చెంచా
కారం - కొద్దిగా
మిరియాల పొడి - కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు - 1 చెంచా
నూనె - వేయించడానికి
తయారీ విధానం..
* ముందుగా ఆలుగడ్డ ఉడికించి పొట్టుతీసి చిదుపుకొని అందులో పన్నీరు కోరు, సిమ్లా మిర్చి ముక్కలు, ఉల్లిముక్కలు, కారెట్ తురుము, ఉప్పు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఈ మసాలా అంతా రెడీగీ ఉంచుకోవాలి.
* ఇప్పుడు బ్రడ్ ల చివర తీసివేసి.. నీటిలో ముంచి తీసి చేతిలో నీరు పోయేలా అద్ది అరిచేతిలోకి తీసుకొని ఒక చెంచాడు పై మసాలా అందులో పెట్టి బ్రడ్ ను అంచులతో మూసి వేసి బిళ్లలా అదమాలి. వాటిని ఒక ట్రేలో ఉంచుకొని పూర్తిగా మనకి కావలసిన టిక్కాలన్నీ తయారయ్యాక ఒక పాన్ లో నూనె పోసి.. ఈ టిక్కాలను కాల్చుకోవాలి.
* డీఫ్రై కంటే.. టిక్కాలను అలా కొద్ది నూనెలో అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని.. సాస్, పుదీనా పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
- భారతి