Bendakaya Pulusu

 

 

 

బెండకాయ పులుసు

 

 

 

కావలసిన  పదార్థాలు:
బెండకాయలు - అర కిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక చెంచా
పచ్చి మిరపకాయలు - 2
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర  - తగినంత
ధనియాలపొడి - పావు కప్పు
 చింతపండు - పావు కప్పు
ఆవాలు - అర చెంచా
జీలకర్ర - ఒక చెంచా
మెంతులు  - పావు చెంచా
మసాలా - ఒక చెంచా
ఉప్పు, కారం, పసుపు, నూనె - తగినంత

 

తయారు చేసే విధానం :
మొదట  బెండకాయలు శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.  ఇలా  చిన్న ముక్కలుగా చేసుకునేటప్పుడు  ప్రతి ముక్క ను జాగ్రత్తగా, పురుగులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగి చిన్నగా తురుముకోవాలి. అలాగే ఒక చిన్న గిన్నెలో చింతపండు శుభ్రంగా కడిగి, కప్పు నిండా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక   బౌల్‌లో నూనె  వేడి చేసిన తరువాత  ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి చిటపటలాడగానే అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు , పచ్చి  మిర్చి వేసుకోవాలి. దాని పైన సగం వరకు ఉప్పు వేసి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ బాగా వేగాక బెండకాయ ముక్కలు  వేసి 5 నుండి 10 నిముషాలు సన్నటి మంట మీద వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల జిగట పదార్థం అంతా ఆవిరైపోతుంది. తర్వాత పసుపు, కారం,  ధనియాల పొడి, సగం ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. నానబెట్టుకున్న చింతపండు నుండి రసం పిండుకుని  అందులో పోయాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. దానిపై మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు మూత  పెట్టి ఉంచి, తరవాత దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పుల్లపుల్లని  బెండకాయ పులుసు రెడీ.