Beetroot Masala Curry

 

 

 

బీట్‌రూట్‌ మసాలా కూర 

 

 

 

కావలసినవి :
బీట్‌రూట్ ‌- 1/2 కిలో
ఉల్లిపాయలు-3
వెల్లుల్లి - 2 రెబ్బలు
అల్లం - చిన్నముక్క
గసగసాలు - 2 స్పూన్లు 
దాల్చిన చెక్క - 3 ముక్కలు
ధనియాలు - 2 స్పూన్లు  
లవంగాలు -  4
పసుపు  -  తగినంత
ఉప్పు, కారం, నూనె - తగినంత

 

తయారు చేసే విధానం:
బీట్‌రూట్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత ఉల్లిపాయలు, మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి  మెత్తగా నూరాలి. బాణాలిలో నూనె వేసి కాగాక ఉల్లిమసాలా ముద్దవేసి బాగా వేపుకోవాలి. అది వేగుతున్నప్పుడే బీట్‌రూట్‌ ముక్కలు వేసి, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి  మూతపెట్టి కాసేపు ఉంచాలి. తర్వాత మూత తీసి కొంచెం నీరు పోసి కలిపి మూతపెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ సన్నసెగమీద ఉడికించాలి. ముక్క ఉడికాక నీరు ఇగిరాక పొయ్యి మీద నుంచి దించాలి. మసాలా  ఘుమఘుమలతో బీట్‌రూట్‌ కూర రెడీ. ఈ బీట్‌రూట్‌ కూర  అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీల్లోకి కూడా బాగుంటుంది.