Barnyard Millet - Odala Cutlet

 

 

 

ఊదల కట్‌లెట్

 

 

 

కావలసినవి:  

ఊదల పిండి - 1 కప్పు

బఠాణీ - పావు కప్పు

ధనియాల పొడి - 1 టీ స్పూను

కంద ముక్కలు - పావు కప్పు

అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు

జీలకర్ర పొడి - 1 టీ స్పూను

మిరప కారం - అర టీ స్పూను

మిరియాల పొడి - అర టీ స్పూను

జీడి పప్పు పలుకులు - 10

కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు

వాము - 1 టీ స్పూను

ఉప్పు - తగినంత

నువ్వుల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు

నెయ్యి - తగినంత

నిమ్మ రసం - 1 టీ స్పూను

 

తయారుచేసే విధానం:

కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి, చేతితో మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ఊదల పిండి, మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్ద వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కట్‌లెట్‌లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కట్‌లెట్‌లను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. జీడి పప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి.