Carrot manchuria

 

 

 

క్యారట్ మంచూరియా

 

కావలసినవి:
తురిమిన క్యారట్ - కప్పు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
శనగపిండి - 2 కప్పులు
కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు - టేబుల్‌స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
సోయాసాస్ - టేబుల్‌స్పూన్
నూనె - కొద్దిగా
టొమాటో సాస్ - టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
వాము - చిటికెడు

 

తయారీ:
ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపేస్ట్, ఉప్ప, కారం, వాము కొద్దిగా నీళ్లు పోసికలపాలి. తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి కాగాకా కలిపి ఉంచుకున్న పిండి ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో  బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తరువాత మరొక స్టవ్ పై గిన్నె పెట్టి కొద్దిగా  నూనె వేసి కాగాక ఉల్లిపాయలు వేయించి  అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ వేసి వేగాక మొత్తం గ్రేవీలాగా అవుతుంది. ఇప్పుడు అందులో  వేయించి పెట్టుకున్న క్యారట్ మంచూరియాలను వేసి కలిపి బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి