Atukula dosa Allam chutney
అటుకుల దోస - అల్లం చట్నీ
కావలసినవి :
అటుకులు : అర కిలో.
మజ్జిగ : ఒక కప్పు
బియ్యం : అర కిలో.
పచ్చిమిర్చి : 10 గ్రా.
జీలకర్ర : 2 చెంచాలు.
తినే సోడా : చిటికెడు.
నూనె : పావు కిలో.
ఇంగువ : తగినంత
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా మజ్జిగని ఒక గిన్నెలోకి తీసుకుని కడిగిన అటుకుల్ని మజ్జిగలో నానపెట్టాలి. బియ్యం నీళ్ళలో నానేయాలి. బియ్యం బాగా నానిన తర్వాత అటుకులు, బియ్యం కలిపి మెత్తగా రుబ్బుకొని, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తినేసోడా వేసి బాగా కలపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఈ పిండితో దోసె వేసుకుని పైన నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
అల్లం పచ్చడి
కావలసినవి :
అల్లం : 100గ్రాములు
బెల్లం : 50 గ్రాములు
చింతపండు : కొద్దిగా
పచ్చిమిరపకాయలు : 3
ఆవాలు : ఒక టీ స్పూన్
జీలకర్ర : ఒక టీ స్పూన్
శనగపప్పు :1 టీ స్పూన్
మినపప్పు : ఒక టీ స్పూన్
మెంతులు : 1/2 టీ స్పూన్
ఎండుమిరపకాయలు : 4
కరివేపాకు : కొద్దిగా
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
తయారీ :
ముందుగా అల్లం పొట్టు తీసి కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లాన్ని నుజ్జుగా చేయాలి. చింతపండును కొద్ది సేపు నానబెట్టి గుజ్జు తీయాలి. ఇప్పుడు గిన్నెలో నూనె పోసి మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చిని వేయించాలి. ఇవి కొద్దిగా చల్లబడ్డాక అల్లంలో వేయాలి. వీటితో పాటుగా చింతపండురసం, బెల్లం కలిపి మిక్సీ లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలను వేయించి వేగాక వీటిని మిక్సీ చేసుకున్న పచ్చడి తాలింపు వెయ్యాలి.